Veenavanka | వీణవంక, ఏప్రిల్ 6 : మండలంలోని పోతిరెడ్డిపల్లి, రామకృష్ణపూర్, కొండపాక, హిమ్మత్ నగర్, చల్లూరు, కోర్కల్ గ్రామాలల్లో ఆదివారం శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి.
పోతిరెడ్డిపల్లిలో పరిపాటి శరత్ కుమార్ రెడ్డి-రూప దంపతులు పట్టువస్త్రాలు తీసుకురాగా, కొండపాక ఉమామహేశ్వర స్వామి ఆలయంలో, హిమ్మత్ నగర్ లో ఛైర్మన్ నల్ల తిరుపతిరెడ్డి-మమత, రామకృష్ణాపూర్ లో గ్రామస్తులు, చల్లూర్ లో అభయాంజనేయ స్వామి ఆలయంలో రాములోరి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.
కొండపాక దాట్ల సమ్మయ్య, వీరస్వామి, కోర్కల్ లో అంబాల కిరణ్ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలల్లో పరిపాటి లక్ష్మారెడ్డి శోభ, పవన్ కుమార్ రజిత, జడల శ్రీకాంత్, గొట్టి రాజయ్య, అప్పని కొమురయ్య, ఏలే కుమారస్వామి, ఊకంటి రమణారెడ్డి, ఏలె మధుసూదన్, ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, గజ్జల శ్రీకాంత్, ఉల్లాల్ శ్రీకాంత్, మల్లారెడ్డి, పొదిల రమేష్, ఆదిరెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.