Mohsin Naqvi | అందుకే యూటర్న్.. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ క్రెడిట్ ఆయనదే..!
Mohsin Naqvi : చిరకాల ప్రత్యర్ధిపై టీమిండియా ఘన విజయంతో . పాక్ బోర్డు యూటర్న్ తీసుకోవడంలో కీలక పాత్ర ఎవరిది? అనేది ఎవరూ పట్టిచుకోలేదు. అయితే.. మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi ) మాత్రం భారత్ - పాక్ మ్యాచ్ క్రెడిట్‌ను ఐసీసీకి ఇవ్వలేదు.
Mohsin Naqvi : పొట్టి ప్రపంచకప్‌లో నాటకీయ పరిణామాల అనంతరం భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. బాయ్‌కాట్ చేస్తామని బెట్టు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మెట్టు దిగడంతో.. ఫిబ్రవరి 15న కొలంబోలో దాయాదుల పోరును కోట్లాది మంది వీక్షించారు. అటు శ్రీలంక బోర్డుకు, ఇటు ఐసీసీకి కోట్ల కొద్ది ఆదాయం సమకూరింది. చిరకాల ప్రత్యర్ధిపై టీమిండియా ఘన విజయంతో . పాక్ బోర్డు యూటర్న్ తీసుకోవడంలో కీలక పాత్ర ఎవరిది? అనేది ఎవరూ పట్టిచుకోలేదు. అయితే.. మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi ) మాత్రం భారత్ – పాక్ మ్యాచ్ క్రెడిట్‌ను ఐసీసీకి ఇవ్వలేదు.
ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతున్న భారత్, పాకిస్థాన్ జట్లు పొట్టి కప్‌లోనూ అభిమానులకు క్రికెట్ మజానిచ్చాయి. పాక్ బాయ్‌కాట్ బెదిరింపులు.. ఐసీసీ ప్రతినిధులు చర్చలు, శ్రీలంక బోర్డు ఈమెయిల్… అనంతరం దాయాదులు ఢీకొన్నాయి. అయితే.. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగడానికి అందరూ అనుకుంటున్నట్టు ఐసీసీ లేదా బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు కారణం కాదని చెప్పాడు మొహ్సిన్ నఖ్వీ. స్పందించిన అతడు.. శ్రీలంక అధ్యక్షుడు సరైన సమయంలో చొరవ తీసుకోవడం వల్లనే తాము యూటర్న్ తీసుకున్నామని చెప్పాడు.
Mohsin Naqvi is basically blaming the Sri Lankan President for Pakistan’s participation and humiliating defeat. 😂 pic.twitter.com/d00RRsJ3qP
— Out Of Context Cricket (@GemsOfCricket) February 17, 2026
ఇండో-పాక్ మ్యాచ్ అనంతరం లంక అధ్యక్షుడు అనుర కుమార దస్సనాయకే (Anura Kumara Dassanayake)తో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు నఖ్వీ. ఈ సందర్భంగా లంక అధినేతకు పీసీబీ చీఫ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ‘పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పారు. భారత్ పాక్ మ్యాచ్ జరగడంలో అసలైన హీరో మీరే. మీ కారణంగానే రెండొందల కోట్ల మంది మ్యాచ్‌ను ఆస్వాదించారు. మీకోసమే మేము టీమిండియాతో ఆడాం. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసేందుకు మాకు చాలా కారణాలున్నాయి. కానీ, మీరు మా ప్రధానికి ఫోన్ చేయడంతో సీన్ మారిపోయింది. ఆయన నాకు వెంటనే కాల్ చేసి.. ఇండియాతో ఆడేందుకు అభ్యంతరాలు తెలపకండి. మన జట్టు కచ్చితంగా ఆడాలి అని నాకు చెప్పారు. అంతే.. ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయంలో మీరు చొరవ తీసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని నఖ్వీ లంక అధ్యక్షుడికి క్రెడిట్ ఇచ్చేశాడు.
ఇషాన్ దంచేయగా..
కొలంబోలో ఇషాన్ కిషన్(77) మెరుపు అర్ధ శతకానికి.. బుమ్రా(2-17) పేస్ పవర్, వరుణ్ చక్రవర్తి(2-17) స్పిన్ మ్యాజిక్ తోడవ్వగా దాయాదిని చిత్తు చేసింది టీమిండియా. 174 పరుగుల ఛేదనకు దిగిన పాక్ పవర్ ప్లేలో బుమ్రా.. అక్షర్ పటేల్ (2-16)ల విజృంభణతో విలవిలలాడింది. అప్పటివరకూ శ్రీలంక అధ్యక్షుడితో పాటు మ్యాచ్ వీక్షిస్తున్న నఖ్వీ తమ జట్టు చెత్త ప్రదర్శనను చూడలేక స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. పాండ్యా ఓవర్లో ఉస్మా్న్ తారీఖ్ బౌల్డవ్వగా.. 61 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సూపర్ 8లో అడుగుపెట్టింది.
3️⃣/3️⃣ for #TeamIndia 💙
The #MenInBlue win by 6️⃣1️⃣ runs to qualify for Super 8! 💪
Scorecard ▶️ https://t.co/IgYYH0TeR9 #T20WorldCup pic.twitter.com/hFPqtYIERe
— BCCI (@BCCI) February 15, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

