IPL 2025 : నిరుడు రన్నరప్ సన్‌రైజర్స్(SRH) హైదరాబాద్ ఐపీఎల్ 18వ సీజన్లో తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కమిన్స్ సేన 6 ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. చెపాక్‌లో సీఎస్కేపై విజయంతో ఆశలు చిగురించినా.. ఇకపై వరుసగా 5 మ్యాచుల్లో గెలిస్తేనే నాకౌట్ పోరుకు అర్హత సాధిస్తుంది ఆరెంజ్ ఆర్మీ. కానీ, ఒక మ్యాచ్‌లో దంచి.. ఆ తర్వాత చతికిలపడుతున్న టాపార్డర్ హైదరాబాద్ జట్టు కొంపముంచుతోంది.
ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ ఢీ కొడుతోంది. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియం శుభ్‌మన్ గిల్ సేకు కొట్టినపిండి. ఆ మైదానంలో కమిన్స్ బృందం చెలరేగి ఆడితే తప్ప గుజరాత్‌ను చిత్తు చేయడం.. ప్లే ఆఫ్స్ దిశగా అడుగేయడం సాధ్యపడదు. కాబట్టి.. ఈ గేమ్‌ను సన్‌రైజర్స్ టాపార్డర్ సహా జట్టు మొత్తం సీరియస్‌గా తీసుకోనుంది.
Hello from Ahmedabad as we gear up for another entertaining clash 💪@gujarat_titans 🆚 @SunRisers
Who will win this one?#TATAIPL | #GTvSRH pic.twitter.com/Nriss86UAy
— IndianPremierLeague (@IPL) May 2, 2025
రాజస్థాన్ రాయల్స్‌పై అదిరే విజయంతో టోర్నీని ఆరంభించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత గొప్పగా ఆడితే ఒట్టు. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన కమిన్స్ సేన పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. అయితే.. ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించి మేము ప్లే ఆఫ్స్ రేసులోనే ఉన్నామని చాటింది. కానీ, ఆ తర్వాత మళ్లీ పరాజయాలు.
ఇక సన్‌రైజర్స్ ఇంటికే అనుకున్న సమయంలో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెక్ పెట్టి ప్లే ఆఫ్స్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకూ ఆడిన 9 మ్యాచుల్లో మూడే విజయాలతో 9వ స్థానంలో ఉన్న హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్‌ను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడే 2 పాయింట్లతో పాటు రన్‌రేటు మెరుగవుతుంది. ఒకవేళ గుజరాత్ గెలిచిందంటే మాత్రం.. హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఇప్పటికే చెన్నై, రాజస్థాన్‌లు 8 ఓటములతో టోర్నమెంట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.