రామవరం, మే 02 : పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న పదో తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలకు రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యుడు బండి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఉచిత కోచింగ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆయా సబ్జెక్ట్‌ల్లో శిక్షణ కొనసాగనున్నట్లు చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా రాయాలి, తప్పులు జరగకుండా చూసుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 7989103692 సంప్రదించవచ్చు అని వెల్లడించారు.