మాగనూరు : ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలు జీతాలు ఇవ్వడం లేదని మాగనూరు ఉమ్మడి మండలాల్లో శుక్రవారం ఉపాధి హామీ సిబ్బంది పెన్ డౌన్ ( Pen Down) నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో ఉపాధి హామీ సిబ్బంది మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో ఉపాధి హామీ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు 4 రోజు నుంచి పెన్ను , షట్ డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఉపాధి హామీ జేఏసీ అధ్యక్షులు సత్య ప్రకాష్ , వినయ్ కుమార్, సరఫరాజ్, చంద్రకంటి శ్రీనివాసులు, గోపాల్ యాదవ్ ,హర్షవర్ధన్ రెడ్డి శ్రావణ్ గౌడ్ పాల్గొన్నారు.