IPL 2025 : సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్(Kamindu Mendis) బంతితోనే కాదు ఫీల్డింగ్ విన్యాసాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. కుడి, ఎడమ చేత్తో బౌలింగ్ చేసి ఔరా అనిపించిన ఇతడు.. చెపాక్ స్టేడియంలో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brewis)కొట్టిన బంతిని గాల్లోకి డైవ్ చేస్తూ ఒడుపుగా ఒడిసి పట్టుకున్నాడు.
అంతే.. బ్రెవిస్ సహా, డగౌట్‌లోని సీఎస్కే ఆటగాళ్లు సైతం షాక్‌లో ఉండిపోయాడు. నమ్మశక్యంకాని రీతిలో మెండిస్ పట్టిన ఆ క్యాచ్.. ఈ ఎడిషన్‌లోని బెస్ట్ క్యాచ్లలో ఒకటి అవుతుందని కామెంటేటర్లు సైతం వ్యాఖ్యానించడం విశేషం.
Only a catch like that could’ve stopped that cameo from Brevis! 🤯
Kamindu Mendis, take a bow 🙇#CSK 119/6 after 14 overs.
Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/NvthsQfpUj
— IndianPremierLeague (@IPL) April 25, 2025
హైదరాబాద్ పేసర్లు షమీ, కమిన్స్ ధాటికి సీఎస్కే 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దూకుడుగా ఆడాడు. రవీంద్ర జడేజా(21)తో కలిసి కీలకమైన 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధ శతాకానికి చేరువైన అతడు హర్షల్ పటేల్ వేసిన 13వ ఓవర్లో లాంగాన్‌లో సిక్సర్‌కు యత్నించాడు. అయితే.. బ్రెవిస్ గాల్లోకి కొట్టిన బంతిని గమనించిన కమిందు మెండిస్ కుడివైపు పరుగెడుతూ వెళ్లి.. గాల్లోకి డైవ్ చేస్తూ శరీరాన్ని ముందుకు సాగదీస్తూ రెండు చేతులతో క్యాచ్ అందుకున్నాడు. అంతే, 114వద్ద చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత హర్షల్ పటేల్(4-28) విజృంభణతో 154 రన్స్‌కే ధోనీ సేన ఆలౌటయ్యింది.
Superman?
No it’s our Kamindu Mendis, one of the best catches of this IPL!That’s some catch to get rid of BabyAB who was smashing sixes at a rate! @SunRisers #CSKvsSRH pic.twitter.com/4sMiUHxw8D
— Ulfath Uwais (@UlfathUwais) April 25, 2025