IPL 2025 : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 43 ఏళ్ల వయసులో మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో విజయవంతమైమన సారథుల్లో ఒకడైన ధోనీ.. ఈ మెగా లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన నాలుగో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న మహీ.. శుక్రవారం 400వ మ్యాచ్ ఆడుతున్నాడు. చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బరిలోకి దిగడం ద్వారా తాలా ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో ఈ మైలురాయికి చేరువైన ధోనీ.. రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, విరాట్ కోహ్లీల సరసన చేరాడు.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబైని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్ ఇప్పటివరకూ 456 మ్యాచులు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
MS Dhoni becomes the fourth Indian to play 400 T20 matches 👏 pic.twitter.com/3qMwrq6svD
— ESPNcricinfo (@ESPNcricinfo) April 25, 2025
ప్రస్తుతం ఆర్సీబీ మెంటర్‌గా సేవలిందుస్తున్న కార్తిక్ ఐపీఎల్లో 412 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మెగా లీగ్ ఆరంభ సీజన్ నుంచి బెంగళూరుకు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ మూడో ప్లేస్‌లో నిలిచాడు. 18 ఎడిషన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ 408 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందిచిన ధోనీ.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు కట్టబెట్టాడు. తాలా సారథ్యంలో తిరుగులేని శక్తిగా అవతరించిన చెన్నై.. 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీని ముద్దాడి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
అయితే.. వయసు 40 దాటడంతో 17వ సీజన్ ముందు కెప్టెన్సీని వదులుకున్న మహీ తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నాడు. అయితే.. 18వ ఎడిషన్ రెండో వారంలో గైక్వాడ్ మోచేతి గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దాంతో, అనుభవజ్ఞుడైన మహీకే మళ్లీ పగ్గాలు అప్పగించింది సీఎస్కే యాజమాన్యం. ఫినిషర్‌గా పేరొందిన ధోనీ ఇప్పటివరకూ ఐపీఎల్లో 137.54 స్ట్రయిక్ రేటుతో 5,243 పరుగులు సాధించాడు. అందులో 24 అర్ధ శతకాలు ఉన్నాయి.