TGSWREIS | హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025- 26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గురుకుల కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీతోపాటు పలు వృత్తివిద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు గురుకుల అధికారిక వెబ్సైట్ www.tgswreis.telangana.gov.in లో సందర్శించాలని, దరఖాస్తులను మే 15వ తేదీలోగా సమర్పించాలని ఆ ప్రకటనలో వెల్లడించారు.