IPL 2025 : సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడుతున్నారు. సన్‌రైజర్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు. ప్యాట్ కమిన్స్ స్లో బాల్‌తో డేంజరస్ ఓపెనర్ ఆయుష్ మాత్రే(30)ను వెనక్కి పంపాడు. మిడాఫ్‌లో ఆయుశ్ కొట్టిన బంతిని ఇషాన్ కిషన్ అందుకోవడంతో 47వద్ద చెన్నై మూడో వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (10) బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ కాసేపటికే రవీంద్ర జడేజా(11) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను హర్షల్ పటేల్ నేలపాలు చేశాడు. 8 ఓవర్లకు చెన్నై స్కోర్.. 61-3.
చెపాక్ స్టేడియంలో మహ్మద్ షమీ చెలరేగాడు. తొలి బంతికే వికెట్ అందించాడు. ఓపెనర్ షేక్ రషీద్(0)ను ఔట్ చేసి సీఎస్కేకు పెద్ద షాకిచ్చాడు. బంతిని స్లిప్‌లో ఆడిన రషీద్.. అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు. దాంతో, ఖాతా తెరవకుండానే చెన్నై మొదటి వికెట్ పడింది.
First-ball wicket for #SRH ☝
But Ayush Mhatre is up and running for #CSK 👏
Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @SunRisers | @ChennaiIPL pic.twitter.com/GDFN0kqVkx
— IndianPremierLeague (@IPL) April 25, 2025
ఆ తర్వాత ఐదో బంతికి ఆయుష్ మాత్రే(30) బ్యాక్‌ఫుట్‌లో ఆడి బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లతో చెలరేగాడు. అయితే.. తడబడుతున్న సామ్ కరన్(9)ను హర్షల్ పటేల్ ఔట్ చేసి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాడు. కమిన్స్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయిన ఆయుష్ సైతం ఔట్ కావడంతో సీఎస్కే కష్టాల్లో పడింది.