IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరులో పంజా విసిరింది. టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్‌ను బ్యాటింగ్ ఆహ్వానించిన కమిన్స్ సేన..పవర్ ప్లేలోనే ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. మూడు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నైని డెవాల్డ్ బ్రెవిస్ (42), రవీంద్ర జడేజా(21)లు ఆదుకున్నాడు. అయితే.. హర్షల్ పటేల్(4-28) సీఎస్కే మిడిలార్డర్‌ను క్రీజులో నిలువనీయలేదు. ఆఖర్లో దీప్ హుడా(22) బ్యాటు ఝులిపించడంతో చెన్నై స్కోర్ 150 దాటింది. ఉనాద్కాట్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన హుడా ఐదో బంతికి ఔట్ కావడంతో ధోనీ సేన 154 పరుగులకు ఆలౌట్ అయింది.
వరుస ఓటములతో అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్ చావోరేవో పోరులో చెలరేగింది. పేసర్లు కట్టదిటత్టటంగా బౌలింగ్ చేయడంతో చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్‌ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసింది. మహ్మద్ షమీ ఆదిలోనే బ్రేకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ షేక్ రషీద్(0)ను ఔట్ చేసి సీఎస్కేకు పెద్ద షాకిచ్చాడు. బంతిని స్లిప్‌లో ఆడిన రషీద్.. అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు. కానీ, 17 ఏళ్ల ఆయుష్ మాత్రే(30) ఆత్మవిశ్వాసంతో ఆడుతూ ఎదురుదాడికి దిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో చెలరేగాడు. అయితే.. తడబడుతున్న సామ్ కరన్(9)ను హర్షల్ పటేల్ ఔట్ చేసి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాడు.
Only a catch like that could’ve stopped that cameo from Brevis! 🤯
Kamindu Mendis, take a bow 🙇#CSK 119/6 after 14 overs.
Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/NvthsQfpUj
— IndianPremierLeague (@IPL) April 25, 2025
కమిన్స్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయిన ఆయుష్ సైతం పవర్ ప్లేలోనే ఔట్ కావడంతో సీఎస్కే కష్టాల్లో పడింది. 47 వద్ద మూడో వికెట్ పడిన సీఎస్కేను తొలి మ్యాచ్ ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్(42), రవీంద్ర జడేజా(21), శివం దూబే(12)లు ఆదుకున్నారు. ధాటిగా ఆడుతున్న జడ్డూను కమింద్ మెండిస్ బౌల్డ్ చేయడంతో సీఎస్కే కోలుకోలేకపోయింది. బ్రెవిస్ మెరుపులకు హర్షల్ పటేల్ కాసేపటికే ముగింపు పలికాడు. హర్షల్టే విజృంభణతో ధోనీ(6), నూర్ అహ్మద్(2)లు పెవిలియన్ చేరారు. వరుసగా వికెట్లు కోల్పోయిన చెన్నైకి దీపక్ హుడా(22) పోరాడగలిగే స్కోర్ అందించాడు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడిన అతడు 20వ ఓవర్లో ఫోర్ బాది ఔటయ్యాడు. దాంతో, 154 రన్స్‌కు ఆలౌటయ్యింది.
Solid display with the ball. Over to the batters now 💪#PlayWithFire | #CSKvSRH | #TATAIPL2025 pic.twitter.com/WYFk8KicNe
— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2025