SAW vs AUSW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్‌కు మరికాసేపట్లో తెర లేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)తో ఫైనల్ బెర్తు కోసం దక్షిణాఫ్రికా(South Africa) తలపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ సారథి లారా వొల్వార్డ్త్ బౌలింగ్ తీసుకుంది.
ఏడోసారి టైటిల్ వేటలో దూసుకెళ్తున్న ఆసీస్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్‌ను దక్షిణాఫ్రికా బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. పాకిస్థాన్‌పై బ్యాటింగ్ చేస్తుండగా గాయపడిన ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీ ఈ మ్యాచ్‌కు దూరమైంది. దాంతో, ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ జట్టును నడిపించనుంది.
It’s SEMI-FINAL TIME in Dubai 🥳
Both teams unchanged. Alyssa Healy hasn’t recovered fully yet.
FOLLOW: https://t.co/WAgm3oN9pc | #T20WorldCup pic.twitter.com/4hOZFvMFNL
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2024
దక్షిణాఫ్రికా : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బ్రిట్స్, అన్నెకె బొస్చ్, మరిజానే కాప్, చ్లొయె ట్రయాన్, సునే లుస్, నడినే డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నొన్కులులెకొ లబా, అయబొంగ ఖాక.
ఆస్ట్రేలియా : గ్రేస్ హ్యారిస్, బేత్ మూనీ(వికెట్ కీపర్), తహ్లియా మెక్‌గ్రాత్(కెప్టెన్), ఎలీసే పెర్రీ, అషే గార్డ్నర్, ఫొబే లిచ్‌ఫీల్డ్, జార్జియా వరేహం, అనాబెల్ సథర్లాండ్, సోఫీ మొలినెక్స్, మేగన్ షట్, డార్సీ బ్రౌన్.