Watch: తెప్పపై నది దాటేందుకు కొందరు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
People Fall Into River | వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు. (People Fall Into River) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని పూర్నియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు ప్రయత్నించారు. నదిపై వంతెన లేకపోవడంతో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక తెప్పను తయారు చేశారు. పిల్లలు, పెద్దలతో సహా సుమారు 20 మంది ఆ తెప్పపై నది దాటేందుకు ప్రయత్నించారు.
కాగా, వెదురు కర్రలతో తాత్కాలికంగా తయారు చేసిన ఆ తెప్పను తాడు సహాయంతో అవతలి ఒడ్డువైపు లాగేందుకు దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ తెప్పపై ఎక్కువ మంది ఉండటంతో అధిక బరువు వల్ల అది బ్యాలెన్స్ తప్పింది. దీంతో ఒక పక్కకు ఆ తెప్ప ఒరిగింది. ఈ నేపథ్యంలో దానిపై ఉన్నవారిలో చాలా మంది ఆ నడిలో పడ్డారు.
మరోవైపు నదిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కాగా, తెప్పపై ఉన్న వారు నదిలో పడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
આવો જુગાડ ભારે પડશે, બિહારમાં અંતિમ સંસ્કારમાં જઈ રહેલા લોકોની હોડી નદીમાં પલટી.#Bihar #boataccident #purnia #boat #river pic.twitter.com/frktxsJpXX
— news continuous (@NewsContinuous) October 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- fall
- Funeral
- Makeshift Raft
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

