Shukri Konrad : దక్షిణాఫ్రికా పురుషుల జట్టుకు గుడ్‌న్యూస్. మూడు ఫార్మాట్లకు బోర్డు కొత్త కోచ్‌ను నియమించింది. మాజీ ఆటగాడైన శుక్రి కొన్రాడ్ (Shukri Konrad)ను కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది సీఎస్. ఈ విషయాన్ని సఫారీ బోర్డు శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. వైట్ బాల్ కోచ్‌గా ఉన్న రాబ్ వాల్టర్(Rob Walter)ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజీనామా చేశాడు. దాంతో, అతడి స్థానాన్ని కొన్రాడ్తో భర్తీ చేసింది సఫారీ బోర్డు.
ఇప్పటివరకూ సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రమే సలహాలు సూచనలు ఇచ్చిన శుక్రి ఇకపై వన్డే, టీ20 జట్లకు కూడా మార్గనిర్దేశనం చేయనున్నాడు. మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఎంపికవ్వడం పట్ల కొన్రాడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా క్రికెట్ ప్రయాణంలో టెస్టు జట్టుకు కోచింగ్ ఇవ్వడం నిజంగా గొప్ప గౌరవం.
Cricket South Africa (CSA) is pleased to announce the appointment of Shukri Conrad as the Proteas Men’s all-format head coach.
Conrad, who has led the Test side since January 2023, will now take charge of the white-ball formats starting with the T20 International tri-series… pic.twitter.com/zXNoutPnKE
— Proteas Men (@ProteasMenCSA) May 9, 2025
ఇప్పుడు వన్డే, టీ20 జట్ల బాధ్యతలు చూడాల్సి రావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దక్షిణాఫ్రికాకు వైట్ బాల్ క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. సీనియర్ ప్లేయర్ల నుంచి జూనియర్ల వరకూ.. సఫారీ జెర్సీ వేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఆ దిశగా బలమైన పునాది వేసేందుకు నేను కృషి చేస్తాను.ప్రస్తుతం మాకు బిజీ షెడ్యూల్ ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ పోటీలపై దృష్టి పెడుతున్నాం’ అని 58 ఏళ్ల కొన్రాడ్ వెల్లడించాడు.
కొన్రాడ్ 2023 జనవరి నుంచి టెస్టు జట్టుకు కోచ్‌గా పని చేస్తున్నాడు. జూలైలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌లో అతడికి పొట్టి క్రికెట్ సవాల్ ఎదురుకానుంది. ఈ ట్రై సిరీస్‌లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్ తలపడనున్నాయి. స్వదేశంలో 2027 జరుగబోయే వన్డే వరల్డ్ కప్ వరకూ కొన్రాడ్ కోచ్‌గా సేవలు అందించనున్నాడు. ఈ మెగా టోర్నీకి జింబాబ్వే, నమీబియాలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
The final leg to Lord’s has begun! 🏟️
From grit to glory, it’s all been leading to this final test of character.
Let’s bring home the Mace! 🏆🏏🇿🇦#WTC25 #WozaNawe #BePartOfIt #ProteasWTCFinal pic.twitter.com/JOZqhBrPGe
— Proteas Men (@ProteasMenCSA) May 7, 2025