Indian Army | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో భారత సైన్యానికి మద్దతుగా శక్తి పూజలు నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, హైదరాబాద్, డిప్యూటీ కమిషనర్, వరంగల్ ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ శుక్రవారం పూజా కార్యక్రమం చేపట్టారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక్ సింధూర్, సైన్యానికి మద్దతుగా ఈ పూజలు నిర్వహించారు. దేశ సైన్యానికి రక్షణ కల్పించాలని.. వారిలో మరింత ధైర్యం పెంచాలని స్వామివారికి పూజలు జరిపారు.
సైనికుల రక్షణ, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. త్వరలోనే దేశం తన సత్తాను చాటి పాకిస్తాన్ కు సరైన గుణపాటం చెబుతుందని పూజా కార్యక్రమాలకు హాజరైన పలువురు పెద్దలు అన్నారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో కొరివితో తల గోకినట్టు చేసి యుద్ధ వాతావరణం సృష్టించారని పాకిస్తాన్ కు ఏ దేశాలు మద్దతు పలకొవద్దని భక్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రవీణ్, మహారాజ్, భక్తులు, పెద్దలు పాల్గొన్నారు.