Allu Sirish | శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం సింగిల్. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా, ఇది భారీ అంచనాలు పెంచింది.అయితే తాజాగా సింగిల్ ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ సింగిల్స్‌ని గెస్ట్లుగా పిలిచి ఫన్నీ ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో భాగంగా అల్లు శిరీష్‌ని యాంకర్ సుమ పెళ్లి ఎప్పుడు అని అడిగేసింది. మా అమ్మానాన్నలకంటే ఎక్కువగా మీరే అడుగుతున్నారు.. ఏమైనా సంబంధాలు చూస్తారా? అని సుమకి శిరీష్ కౌంటర్ వేశాడు. అంతేకాకుండా తనకి సింగిల్ లైఫ్ చాలా బాగుంది అని, పెళ్లి చేసుకోవద్దని చాలా మంది చెబుతున్నారని శిరీష్ అన్నాడు.
తన తండ్రి అల్లు అరవింద్ కూడా పదేశ్ల నుండి పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నాడట. అయితే పెళ్లి చేసుకోమని ఎంత అడిగిన శిరీష్ మాత్రం మూవీపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. పెళ్లి కంటే సింగిల్‌గా ఉంటేనే బాగుంటుందని అల్లు శిరీష్ అంటున్నాడు. మీ ఇంట్లోనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది.. బన్నీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు కదా అని సుమ అంటే.. నేను సింగిల్‌గా కూడా హ్యాపీగానే ఉన్నాను కదా అని రివర్స్ పంచ్ వేశాడు శిరీష్. దాంతో శిరీష్ ఇక తన నిర్ణయం మార్చుకునేలా కనిపించడం లేదంటూ హ్యాండ్సప్ అనేసింది సుమ.
సారీ అరవింద్ గారు.. మీరు పదేళ్ల నుంచి చేయలేనేది నేను ఒక్క ఈవెంట్లో ఎలా చేయగలను అంటూ అక్కడినుండి వెళ్లిపోయింది సుమ. శిరీష్ ఇంకా సింగిల్ లైఫ్‌నే కోరుకుంటున్నాడని, అందుకే శిరీష్‌ను సింగిల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసింది సుమ.ఒకప్పుడు డిఫరెంట్ లుక్‌తో కనిపించే అల్లు శిరీష్ ఇప్పుడు వెరైటీ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. తన లుక్‌ను, హెయిర్ స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు. ఏదైనా సినిమా కోసం ఇలా మారిపోయాడా? లేదంటే నార్మల్‌గానే లుక్ ఛేంజ్ చేశాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఊర్వశీవో రాక్షసివో సినిమా షూటింగ్, ప్రమోషన్స్ టైంలో అను ఇమాన్యుయేల్‌తో క్లోజ్‌గా ఉన్నారని, వారిద్దరు పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. కాని అవన్ని పుకార్లుగానే మిగిలిపోయాయి.