WIW vs SAW : మహిళల టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ (West Indies)కు దక్షిణాఫ్రికా చుక్కలు చూపించింది. హిట్టర్లతో నిండిన కరీబియన్ జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. స్పిన్నర్ నొన్కులులెకొ లాబా(4/29) మ్యాజిక్‌తో విండీస్ 118 పరుగులకే పరిమితమైంది. ప్రధాన ప్లేయర్లంతా చేతులెత్తేసిన చోట స్టఫానీ టేలర్(44) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆఖర్లో జైదా జేమ్స్ (15 నాటౌట్), క్యాంప్‌బెల్(17)లు బ్యాటు ఝులిపించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
టాస్ గెలిచి వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. 15 పరుగులకే ఆల్‌రౌండర్ మరిజానే కాప్ ఓపెనర్ హేలీ మాథ్యూస్(10)ను బోల్తా కొట్టించింది. ఆ తర్వాత బంతి అందుకున్న లబా మరో ఓపెనర్ క్వియానా జోసెఫ్(4)ను బౌల్డ్ చేసి విండీస్‌ను ఒత్తిడిలో పడేసింది.
Magnificent Mlaba!
A career-best spell puts South Africa on top in Dubaihttps://t.co/bjzOd7LSZ9 | #T20WorldCup pic.twitter.com/4GnUMxtBbN
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2024
అయితే.. స్టఫానీ టేలర్(44), విధ్వంసక ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ (13)లు ధనాధన్ ఆడి జట్టును ఆదుకున్నారు. కానీ.. మరిజానే మరోసారి జట్టుకు బ్రేక్‌నిస్తూ డాటిన్‌ను వెనక్కి పంపింది. దాంతో.. 62 పరుగులకే విండీస్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో టేలర్, జైదా(15 నాటౌట్)లు బౌండరీలతో విరుచుకుపడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.