Health tips : సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు. కొంత మంది బ్రష్ చేసి నీళ్లు తాగితే మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పరగడుపున నీళ్లు తాగుతారు. అయితే ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రికి పడుకుని ఉదయం లేవగానే నోటి నిండా క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. పళ్లపై, నాలుకపై అవి పేరుకుపోతాయి. కాబట్టి లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగితే.. నీళ్లతోపాటు క్రిములు కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అనేక వ్యాధులు వస్తాయి. పళ్లు కూడా దెబ్బతింటాయి. అయితే పల్లు తోముకుని పరగడుపున నీటిని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పరగడుపున ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడంవల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్, మలిన పదార్థాలు బయటకు పోతాయి. మల బద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.
శరీరంలో కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే చర్మ సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి సహజంగానే మెరుపు వస్తుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే జీర్ణాశయం శుభ్రమవుతుందని అంటున్నారు.