Annerie Dercksen : అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ అన్నేరీ డెరిక్సెన్(Annerie Dercksen) చరిత్ర సృష్టించింది. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన రెండో మహిళగా రికార్డు నెలకొల్పింది. ముక్కోణపు వన్డే సిరీస్(Tri Nation Series) ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అన్నేరీ సెంచరీ బాదడం ద్వారా ఈ ఘనత సాధించింది.
కొలంబో మైదానంలో శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన ఈ సఫారీ సంచలనం.. 104 పరుగులు చేసి ఔటయ్యింది. తద్వారా ఏడో స్థానంలో ఆడి శతకం చేసిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కింది. ఆమె కంటే ముందు వెస్టిండీస్ క్రికెటర్ షెమైనె క్యాంప్‌బెల్(Shamaine Campbell) ఈ మైలురాయికి చేరుకుంది. ఈ డాషింగ్ బ్యాటర్ 2013లో శ్రీలంకపైనే 105 రన్స్ చేసింది. ప్రస్తుతం తనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌కు చెందిన అమీ జోన్స్ 92 నాటౌట్‌తో మూడో స్థానంలో ఉంది.
Annerie Dercksen was on song against Sri Lanka, notching up her maiden ODI century 🔥
📝 #SLvSA: https://t.co/Tk8H3MmOqP pic.twitter.com/rMO1bO4ZDC
— ICC (@ICC) May 9, 2025
వన్డే క్రికెట్లో 7వ స్థానంలో ఆడుతూ సెంచరీ బాదిన మహిళా క్రికెటర్లు మొత్తం 10 మంది. వీళ్లలో డెరిక్సెన్తో కలిపి సఫారీ ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి ఇద్దరు.. ఇంగ్లండ్, స్కాట్లాండ్, పాకిస్థాన్ నుంచి ఒకరు శతకం సాధించారు.
1. షెమైనే క్యాంప్‌బెల్ వెస్టిండీస్ 105 పరుగులు 2013లో శ్రీలంకపై
2. అనేరీ డెరిక్సన్ దక్షిణాఫ్రికా 104 2025లో శ్రీలంకపై
3. అమీ జోన్స్ ఇంగ్లండ్ 92 నాటౌట్ – 2024లో న్యూజిలాండ్‌పై
4. చ్లో ట్రయాన్ దక్షిణాఫ్రికా 92 2016లో ఐర్లాండ్‌పై
5. రెబెక్కా రాల్స్ న్యూజిలాండ్ 84 నాటౌట్ 1999 దక్షిణాఫ్రికాపై
6. అలియా రియాజ్ పాకిస్థాన్ 81, 2021లో దక్షిణాఫ్రికాపై
7. అల్లీ కుయ్లార్స్ దక్షిణాఫ్రికా 74 నాటౌట్, 1997లో పాకిస్థాన్‌పై.
8. సోఫీ డెవినె న్యూజిలాండ్ 74 నాటౌట్, 2010లో ఆస్ట్రేలియాపై
9. కథ్రినే ఫ్రేజర్ స్కాట్లాండ్ 74 నాటౌట్, 2024లో పపువా న్యూగినియాపై
10. చ్లో ట్రయాన్ దక్షిణాఫ్రికా 74, శ్రీలంకపై 2025లో.
ముక్కోణపు వన్డే సిరీస్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. అన్నేరీ డెరిక్సెన్ సూపర్ సెంచరీతో చెలరేగగా శ్రీలంకను సఫారీ జట్టు చిత్తుగా ఓడించింది. దాంతో, విజయంతో టోర్నీని ముగించింది. తాను ఎదుర్కొన్న మూడో బంతినే బౌండరీకి తరలించిన డెరిక్సెన్ ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడింది. లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగిన తను తొలి సెంచరీ సాధించింది. 84 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో మూడంకెల స్కోర్ అందుకుంది.
Chloe Tryon’s record outing in Colombo helped South Africa overcome the Sri Lanka challenge 👊https://t.co/hljOb8hh6i
— ICC (@ICC) May 9, 2025
అనంతరం 316 పరుగుల ఛేదనలో లంకను దక్షిణాఫ్రికా స్పిన్నర్ చ్లో ట్రయాన్ (5-34) దెబ్బకొట్టింది. ఐదు వికెట్లు తీసి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(52), అనుష్క సంజీవని(43)లు పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.