South Central Railway | హైదరాబాద్ : భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ అయింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ప్రధాన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడలో భారీ భద్రతను పెంచినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. ప్రతి ప్రయాణికుడిని, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత స్టేషన్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు.
భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులను మూసివేయడంతో రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని శ్రీధర్ పేర్కొన్నారు.