ICC : పొట్టి సిరీస్‌లో భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడిన గురైన దక్షిణాఫ్రికా(South Africa)కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు యువ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee)పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఐసీసీ నియమ నిబంధనలను ఉల్లఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. అసలేం జరిగిందంటే..?
జొహన్నెస్‌బర్గ్ వేదికగా టీమిండియాతో జరిగిన నాలుగో టీ20లో గెరాల్డ్ కొయెట్జీ ఐసీసీ కోడ్ ఉల్లంఘించాడు. ఆ మ్యాచ్‌లో పదే పదే వైడ్ బంతులు వేసిన అతడు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
అంపైర్ అల్లాహుద్దీన్ పలేకర్, స్టీఫెన్ హ్యారీస్‌లు ‘వైడ్ బాల్’ (Wide Ball) అని ప్రకటించగా.. అది వైడ్ కాదన్నట్టు ఈ పేసర్ హావభావాలు పెట్టాడు. అంతేకాదు వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ అతడిపై ఐసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాడు. మ్యాచ్ సమయంలో కొయెట్జీ ఆర్టికల్ 2.8లోని నిబంధనను ఉల్లంఘించాడని నివేదించాడు.
Scott Edwards, Sufyan Mehmood, and Gerald Coetzee were found guilty of breaching the ICC Code of Conduct.https://t.co/wBXgVcuEET
— ICC (@ICC) November 19, 2024
ఇదే విషయమై అధికారులు సఫారీ పేసర్‌ను ప్రశ్నించగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో, మొదటి పొరపాటుగా భావించిన క్రమశిక్షణ కమిటీ కొయెట్జీకి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మళ్లీ అలాంటి తప్పు చేయాలనే ఆలోచనే రాకుండా ఉండేందుకు అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. అంతేకాదు నెదర్లాండ్స్, ఒమన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో కూడా ఐసీసీ కోడ్‌ను ఉల్లంఘన జరిగింది. దాంతో, డచ్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, ఒమన్ బౌలర్ సుఫియన్ మహమూద్లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకోనుంది.
Unbelievable feeling! Special, special day. Congratulations to the entire team 🇮🇳❤️❤️ pic.twitter.com/nhlUikxGOu
— Tilak Varma (@TilakV9) November 15, 2024
ఇక.. జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టీ20లో భారత జట్టు రికార్డు స్కోర్‌తో సిరీస్ కైవసం చేసుకుంది. తిలక్ వర్మ(120 నాటౌట్), ఓపెనర్ సంజూ శాంసన్(109 నాటౌట్)లు సెంచరీలతో కదం తొక్కగా సఫారీ జట్టును 135 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ పట్టేసింది.