అమరావతి : ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (Shaik Sabji) మరణంతో ఖాళీ అయిన స్థానంలో నిర్వహిస్తున్న ఉప ఎన్నికల (By-Election ) ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం నామినేషన్ల పరిశీలనను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆరుగురు నామినేషన్లు (Nomination) సక్రమంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈనెల 21 వరకు ఉపసంహరణకు గడువుంది.
డిసెంబర్ 5న ఎన్నికలు , 9న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆరు జిల్లా పరిధిలో 16,036 మంది టీచర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గంధం నారాయణరావు, కవల నాగేశ్వరరావు, షేక్ అహ్మద్, నామన వెంకటలక్ష్మి, పులుగు దీపక్ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. కాగా విజయనగరం స్థానిక సంస్థల వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ రఘురాజు పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించినందుకు గాను మండలి చైర్మన్కు చేసిన ఫిర్యాదు చేయడంతో ఆయన రఘురాజుపై అనర్హత వేటు వేశారు.
దీంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రద్దు చేసింది. తనపై అనర్హత వేటు వేసినందుకు గాను రఘురాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల సంఘం స్పందించి ఉప ఎన్నికకు ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్సీ రఘురాజు కొనసాగవచ్చని శాసనమండలి గుర్తించింది.