Team India : దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ (Jonty Rhodes) పేరు తెలియని వారుండరు. ‘సఫారీ చిరుత’గా ప్రశంసంలదుకున్న రోడ్స్ పేరు చెవిన పడితే చాలు.. నమ్మశక్యంకానీ ఫీల్డింగ్ విన్యాసాలే గుర్తుకొస్తాయి. తన మెరుపు ఫీల్డింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ సఫారీ ఆటగాడు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ (Fielding Coach)గా రాబోతున్నాడు. పురుషుల సీనియర్ జట్టు హెడ్‌కోచ్‌గా ఖరారైన గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమ్‌లో రోడ్స్ కూడా ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ ముగిశాక జూలైలో జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉందని టాక్. అయితే.. అతడి నియామకంపై బీసీసీఐ(BCCI) అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మైదానంలో చిరుతను తలపించిన రోడ్స్ గనుక భారత జట్టు సహాయక బృందంలో చేరితే ఇక రోహిత్ సేన ఫీల్డింగ్ అదిరినట్టే. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవిని రోడ్స్ ఆశించడం ఇది రెండోసారి. 2019లో అతడు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, అప్పుడు టి. దిలీప్(T. Dileep) ఆ చాన్స్ కొట్టేశాడు. మరి ఈసారైనా బీసీసీఐ రోడ్స్‌కు అవకాశమిస్తుందా? లేదా? అనేది చూడాలి.
గాల్లో తేలుతూ క్యాచ్ పట్టిన జాంటీ రోడ్స్
సఫారీ దిగ్గజానికి ఐపీఎల్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2009లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీతో రోడ్స్‌కు కాంట్రాక్ట్ కుదిరింది. 2018 వరకూడ అంటే 9 ఏండ్లు సేవలందించాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనుంది. అతడితో పాటు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్(T Dileep) టర్మ్ కూడా ఎండ్ కానుంది. అంతేకాదు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ ప్రవీణ్ అమ్రేల కాంట్రాక్ట్ కూడా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ డే వరకే. దాంతో, అమెరికా, వెస్టిండీస్‌లు ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్ ద్రవిడ్ టీమ్‌కు ఓ రకంగా ఫేర్వెల్ టోర్నీ లాంటిది.