హైదరాబాద్ : ఇసుక ట్రాక్టర్(Sand tractor) ఢీ కొని ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా మోతె మండలం తుమ్మలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్‌ను ఢీ కొని మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు న్యాయం చేయాలంటూ ఖమ్మం రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై ముళ్ల కంచె వేసి నిరసన తెలిపారు.దీంతో మోతె వద్ద నేషనల్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.