Team India : టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్లో భారత జట్టు(Team India) కీలక మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ విజయాలతో రెండో రౌండ్‌కు చేరిన టీమిండియా సూపర్ – 8 మ్యాచుల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సోమవారం కరీబియన్ గడ్డపై కాలు మోపిన టీమిండియా క్రికెటర్లు సముద్రం ఒడ్డున సేదదీరారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రింకూ సింగ్.. తదితరులంతా బార్బడోస్ (Barbados) పట్టణంలోని కడలి తీరంలో సరదాగా గడిపారు. అక్కడి బీచ్‌లో హుషారుగా వాలీబాల్ (Beach Valleyball) ఆడారు. బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
📍 Barbados
Unwinding at the beach 🌊, the #TeamIndia way! #T20WorldCup pic.twitter.com/4GGHh0tAqg
— BCCI (@BCCI) June 17, 2024
నిరుడు రోహిత్ శర్మ సారథ్యంలో టెస్టు గద, వన్డే వరల్డ్ కప్ చేజార్చుకున్న భారత జట్టు ఈసారి టైటిల్‌పై కన్నేసింది. 11 ఏండ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని హస్తగతం చేసుకునేందుకు రోహిత్ సేన మెగా టోర్నీలో అడుగుపెట్టింది. వరుసగా మూడు విజయాలతో గ్రూప్ ‘ఏ’ లో టాపర్‌గా నిలిచిన టీమిండియా సూపర్- 8కు చేరుకుంది. లీగ్ దశ మ్యాచులన్నీ అమెరికాలో ఆడేసిన భారత్.. నాకౌట్ మ్యాచులను వెస్టిండీస్ గడ్డపై ఆడనుంది. సూపర్ 8లో భాగంగా జూన్ 20న గురువారం అఫ్గనిస్థాన్‌తో రోహిత్ బృందం తలపడనుంది.
Bangladesh join India, Australia and Afghanistan in the #T20WorldCup Super Eights 👊 pic.twitter.com/H3c8mPmEyf
— ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2024