హైదరాబాద్ : విద్యార్థులకు చదువులు చెప్పి విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన పాఠశాల అధికారుల నిర్లక్ష్యంతో పశువుల దొడ్డిలా(Cattle shed) మారింది. ప్రశాంతమైన వాతావరణంలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు పశువుల మందతో కలిసి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లా(Kahamm) గొల్లగూడెం మండలం వెలుగుమట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Government school) సిబ్బంది పట్టించుకోకపోవడంతో పశువులకు కొట్టంగా మారింది. గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ పశువులను పాఠశాల ఆవరణలో కట్టేస్తున్నారు. కాగా, బడి పిల్లలు ఉండాల్సిన చోటులో పశువులు ఉంటున్నాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పశువుల దొడ్డిలా మారిన ప్రభుత్వ పాఠశాల
ఖమ్మం – గొల్లగూడెం మండలం వెలుగుమట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సిబ్బంది పట్టించుకోకపోవడంతో పశువులకు కొట్టంగా మారింది.
బడి పిల్లలు ఉండాల్సిన చోటులో పశువులు ఉంటున్నయంటూ, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు… pic.twitter.com/lAHSvxGtv4
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2024