తిరువనంతపురం: జీ9 సదస్సులో జరిగిన మోదీ-పోప్ ఫ్రాన్సిస్ భేటీపై కేరళ కాంగ్రెస్ పార్టీ(Kerala Congress) తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన మీమ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పింది. మోదీ-పోప్ ఫోటోను పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్ దానికి ఒక క్యాప్షన్ ఇచ్చింది. చివరకు దేవున్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కినట్లు ఆ క్యాప్షన్‌లో రాసింది. అయితే బీజేపీతో పాటు ఇతర పార్టీల నుంచి ఆ పోస్టుపై నెగటివ్ కామెంట్లు జోరందుకున్నాయి. దీంతో కేరళ కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టును తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించింది. క్రైస్తవ వర్గానికి క్షమాపణలు జారీ చేసింది. పోప్‌ను అవమానించడం తమ ఉద్దేశం కాదు అని, కానీ దైవదూతను అని చెప్పుకున్న ప్రధాని మోదీని విమర్శించడమే తన లక్ష్యమని ఆ పార్టీ పేర్కొన్నది.
ഒരു മതത്തെയും മതപുരോഹിതന്മാരെയും ആരാധനാമൂർത്തികളെയും അപമാനിക്കുകയും അവഹേളിക്കുകയും ചെയ്യുന്നത് ഇന്ത്യൻ നാഷണൽ കോൺഗ്രസിന്റെ പാരമ്പര്യമല്ലെന്ന് ഈ നാട്ടിലെ ജനങ്ങൾക്ക് മുഴുവനും അറിയാം. എല്ലാ മതങ്ങളെയും വിശ്വാസങ്ങളെയും ചേർത്ത് പിടിച്ച് സൗഹാർദ്ദപരമായ അന്തരീക്ഷത്തിൽ ജനങ്ങളെ മുന്നോട്ടു… pic.twitter.com/Jg7HBh9BMw
— Congress Kerala (@INCKerala) June 16, 2024