South Africa | షార్జా: అఫ్గానిస్థాన్ చేతిలో వరుసగా రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ఓదార్పు విజయం దక్కింది. ఆదివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో 7వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత అఫ్గన్‌ను 34 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. ఛేదనను 33 ఓవర్లలోనే పూర్తిచేశారు. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా అఫ్గన్లు సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించారు.
గాలె: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 63 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. 275 పరుగుల ఛేదనలో భాగంగా కివీస్ 211 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి రోజు ఆ జట్టు విజయానికి 68 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు మరో 5 పరుగులే జతచేయగలిగింది. న్యూజిలాండ్ భారీ ఆశలు పెట్టుకున్న రచిన్ రవీంద్ర (92) ఒక్క పరుగు మాత్రమే జోడించి ఔటయ్యాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఐదు (5/68) వికెట్లతో విజృంభించాడు.