SAW vs SCOW : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఉత్కంఠగా సాగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా (South Africa) రెండో విజయం సాధించింది. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సఫారీ జట్టు బుధవారం స్కాట్లాండ్ (Scotland)ను చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఏకంగా 80 పరుగుల తేడాతో గెలుపొందింది. నొన్కులులెకొ లబా(3//12), చ్లొయె ట్రయాన్(2/22)ల విజృంభనతో స్కాట్లాండ్ బ్యాటర్లు ‘మేము ఆడలేమం’టూ చేతులెత్తేశారు. దాంతో, మెరుగైన రన్‌రేటు సాధించిన లారా వొల్వార్డ్త్ సేన గ్రూప్ బీలో అగ్రస్థానానికి ఎగబాకి సెమీస్ రేసులో నిలిచింది.
తొమ్మిదో సీజన్లో దక్షిణాఫ్రికా రికార్డు సృష్టిస్తూ స్కాంట్లాండ్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత టార్గెట్‌ను చూడగానే డీలా పడిన స్కాట్లాండ్ బ్యాటర్లు.. క్రీజులో నిలువలేకపోయారు. ఇంకేముంది రికార్డు లక్ష్య ఛేదనలో స్కాంట్లాండ్ వల్ల కాలేదు. నొన్కులులెకొ లబా(3/12), చ్లొయె ట్రయాన్(2/22)లు స్కాట్లాండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. దాంతో.. స్కాంట్లాండ్ 86 పరుగులకే కుప్పకూలింది. విధ్వంసక ఇన్నింగ్స్‌లో సఫారీ విజయంలో భాగమైన మరినే కాప్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.
An 80-run victory takes South Africa straight to the top of Table B! ⬆️ pic.twitter.com/790NHPVWH4
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2024
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట కొండంత స్కోర్ చేసింది. తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో స్కాంట్లాండ్ బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్లు తంజిమ్ బ్రిట్స్(43), లారా వొల్వార్డ్త్(40)లు బౌండరీలతో విరుచుకుపడ్డారు.. ఆల్‌రౌండర్ మరినే కాప్(43) సైతం చితక్కొట్టింది. దాంతో, దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోర్. రికార్డు లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ తడబడింది.