IND vs BAN 2nd T20 : తొలి టీ20లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత జట్టు సిరీస్‌పై కన్నేసింది. రెండో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకుంది. సిరీస్‌లో బోణీ కొట్టాలనుకుంటున్న బంగ్లా.. తంజిమ్ షకీబ్‌కు చోటిచింది.
మరోవైపు జోరుమీదున్న టీమిండియా ఏ మార్పులు లేకుండా ఆడనుంది. తొలి మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్‌లు మళ్లీ శుభారంభం ఇస్తే.. భారత జట్టుకు భారీ స్కోర్‌కు పునాది పడ్డట్టే. ఓపెనర్లు దంచేస్తే.. ఆ తర్వాత వీరకొట్టుడు కొట్టేందుకు కెప్టెన్ సూర్య, పాండ్యా, రింకూ, పరాగ్‌లు ఉండనే ఉన్నారు. దాంతో.. ఈ మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థికి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశముంది.
#TeamIndia remain unchanged for the 2nd T20I 👌
A look at our Playing XI 🙌
Live – https://t.co/Otw9CpO67y#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/bgcJ7M8dJu
— BCCI (@BCCI) October 9, 2024
భారత జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్ జట్టు : పర్వేజ్ హొసేన్ ఎమొన్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిహద్ హొసేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ షకీబ్, ముస్తాఫిజుర్.