ICC T20 Ranking | ఐసీసీ బుధవారం టీ20 ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో తొలిసారిగా టీ20 ర్యాకింగ్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు హార్దిక్ ప్యాండా ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానానికి చేరాడు. ఈ నెల 6న గ్వాలియర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. దాంతో ఈ ఫాస్ట్ బౌలర్ ఎనిమిది ర్యాంకులను మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇంతకు ముందు 16వ ప్లేస్‌లో ఉన్నాడు. టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో అర్ష్‌దీప్ కొనసాగుతున్నాడు.
ఇక ఇంగ్లండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్ 721 పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. అకేల్ హుస్సేన్, రషీద్ ఖాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రవి బిష్ణోయ్‌కు ఒక స్థానం దిగజారి 12వ ప్లేస్‌కి చేరాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో ఆడే అవకాశం దక్కలేదు. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఓ వికెట్ తీయడంతో పాటు 39 పరుగులు సాధించాడు. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 11వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ రెండో ప్లేస్‌కు చేరుకున్నాడు. జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ నెంబర్ వన్‌గా నిలిచాడు.