Hong Kong Sixes 2024 : చిరాకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌లు మరోసారి ఒకే వేదికపై తలపడనున్నాయి. ఈమధ్యే టీ20 వరల్డ్ కప్‌లో అభిమానులను అలరించిన దాయాది జట్లు మళ్లీ మైదానంలో సింహగర్జన చేయనున్నాయి. హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes) 2024 టోర్నమెంట్లో భారత్, పాక్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. హాంకాంగ్ సిక్సెస్ నిర్వాహకులు బుధవారం గ్రూప్ జాబితా విడుదల చేశారు.
భారత్, పాకిస్థాన్‌లు గ్రూప్ సీలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు గ్రూప్ బీలో చోటు దక్కింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు గ్రూప్ ఏలో నిలవగా.. గ్రూప్ డీలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లు పోటీ పడనున్నాయి. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మూడు రోజుల్లోనే ముగుస్తుంది. కాబట్టి లీగ్ దశలో 12 మ్యాచ్‌లు ఆడిస్తారు. ఆ తర్వాత ఆరు మ్యాచ్‌లు.. నవంబర్ 3వ తేదీన రెండు సెమీ ఫైనల్స్.. అనంతరం ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఆరు ఓవర్ల ఫార్మాట్ అయిన ఈ లీగ్ ఆద్యంతం గొప్పగా సాగుతుందని వాళ్లు ఆశిస్తున్నారు.
🚨POOLS ANNOUNCED🚨
People travel miles to venues to watch India vs Pakistan or England vs Australia. Both games can been seen back to back at one venue only at the Hong Kong Sixes.
Prepare for explosive power hitting and a storm of sixes that will electrify the crowd! 🔥… pic.twitter.com/txS8Cpg2Gl
— Cricket Hong Kong, China (@CricketHK) October 9, 2024
గ్రూప్ ఏ జట్లు – దక్షిణాఫ్రికా(ఏ1), న్యూజిలాండ్(ఏ2), హాంకాంగ్, చైనా(ఏ3)
గ్రూప్ బీ జట్లు – ఆస్ట్రేలియా (బీ1), ఇంగ్లండ్(బీ2), నేపాల్(బీ3)
గ్రూప్ సీ జట్లు – ఇండియా (సీ1), పాకిస్థాన్(సీ2), యూఏఈ(సీ3)
గ్రూప్ డీ జట్లు – శ్రీలంక(డీ1), బంగ్లాదేశ్(డీ2), ఒమన్(డీ3)
హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో నిబంధనలు కొత్తగా ఉంటాయి. అవేంటంటే.. 1. ప్రతి జట్టులో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. 2. ప్రతి ఇన్నింగ్స్‌కు ఐదు ఓవర్లు కేటాయిస్తారు. ఒక్కరికి ఒక్క ఓవర్ మాత్రమే ఇస్తారు. అయితే… ఫైనల్లో మాత్రం ఓవర్‌కు ఆరు కాకుండా 8 బంతులు వేయాల్సి ఉంటుంది. 3. ప్రతి వైడ్, నో బాల్‌కు రెండు పరుగులు ప్రకటిస్తారు.
4. ఏ బ్యాటర్ అయినా 31 రన్స్ కొడితే అతడు రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాలి. వాళ్ల జట్టు ఆలౌట్ అయినప్పుడు మాత్రమే అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రావొచ్చు. 5. బ్యాటింగ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయిన సందర్భంలో కూడా ఆరో ఆటగాడు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఆరుగురిని ఔట్ చేస్తేనే ఆ జట్టు ఆలౌట్ అయినట్టు లెక్క.
The Hong Kong International Cricket Sixes Set To Make A Comeback
Iconic International Cricket Tournament Returns with a Three-Day Festival in November
Hong Kong is the sporting capital of East Asia, and cricket has had a special place in the city’s sporting history, with the… pic.twitter.com/On6SAs3Y0s
— Cricket Hong Kong, China (@CricketHK) August 2, 2024
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ 1992లో మొదటిసారి జరిగింది. టీవీ ప్రేక్షకులను అమితంగా అలరించిన ఈ టోర్నీలో మళ్లీ 12 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు కూడా ఈ పోటీల్లో ఆడేందుకు ఆసక్తిగా ఉంది. టీమిండియా సైతం హాకాంగ్స్ సిక్సెస్ 2024లో బరిలోకి దిగనుంది. పవర్ హిట్టర్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడడం.. స్టేడియంలోని ప్రేక్షకులు ఊగిపోవడం.. అనుక్షణం ఉత్కంఠ.. ఇలా ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ చూడబోతున్నారు అని హాకాంగ్ సిక్సెస్ నిర్వాహకులు పోస్ట్ ద్వారా వెల్లడించారు.