INDW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ రేసులో వెనకబడిన భారత జట్టు (TeamIndia) కీలక పోరుకు సిద్దమైంది. ఆసియా కప్ ఫైనల్లో షాకిచ్చిన శ్రీలంక (Srilanka)తో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు లంకకు కూడా ఇది చావోరేవో లాంటి మ్యాచే.
ఇరుజట్లు విజయంపై కన్నేసిన ఈ పోరులో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. పాకిస్థాన్‌పై అతికష్టమ్మీద గట్టెక్కిన భారత్.. లంకపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంటుంది. గత రెండు మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు చెలరేగితే తప్ప భారత్ భారీ చేయడం కష్టం. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదిస్తూ మిడిల్ ఓవరల్లో జెమీమా, కెప్టెన్ కౌర్‌లు రాణించడం.. రీచా ఫామ్ అందుకోవడంపై టీమిండియా స్కోర్ ఎంత చేస్తుందనేది ఆధారపడి ఉంది.
🚨 Team Update 🚨#TeamIndia remain unchanged for their match against Sri Lanka
Here’s a look at our Playing XI 👌👌
Follow the match ▶️ https://t.co/4CwKjmWL30#T20WorldCup | #INDvSL | #WomenInBlue pic.twitter.com/CbH7L7Xvyb
— BCCI Women (@BCCIWomen) October 9, 2024
భారత జట్టు : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సంజీవన్ సజన, అరుంధతీ రెడ్డి, శ్రేయాంక పాటిల్, అశా శోభన, రేణుకా సింగ్.
శ్రీలంక జట్టు : విశ్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హరి, నీలాక్షి డిసిల్వా, అనుష్క సంజీవని(వికెట్ కీపర్), అమా కాంచన, సుగంధిక కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రభోదిని, ఇనొక రణవీర.