స్ట్చర్చ్: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పరాభవం అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ న్యూజిలాండ్‌కు నిరాశ తప్పలేదు. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టీ20లో సఫారీలు.. 33 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేసి సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. 20 ఓవర్లకు 4 వికెట్లే కోల్పోయి 187 రన్స్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ కొనర్ ఎస్తర్హ్యూజన్ (33 బంతుల్లో 75, 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌కు తోడు హర్మన్ (39), మల్డర్ (31) రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లకు 154/8కే పరిమితమైంది. బెవాన్ జాకబ్స్ (36) టాప్ స్కోరర్. కొయెట్జ్, మల్డర్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు తీసి సఫారీల గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు.