డర్బన్: మరో రెండు నెలల్లో మొదలుకానున్న మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది. ఓటమితో సిరీస్‌ను ప్రారంభించిన ఉమెన్ ఇన్ బ్లూ.. ఆదివారం డర్బన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విఫలమైంది. మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆహ్వానం మేరకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. నిర్ణీత ఓవర్లకు 147 రన్స్‌కే ఆలౌట్ అయింది. షెఫాలీ వర్మ (57), అనుష్క శర్మ (28) మినహా మిగిలిన బ్యాటర్లు తేలిపోయారు. సఫారీ బౌలర్లలో ట్రైయాన్ (3/22), సెకుకునె (3/31) భారత్‌ను కట్టడిచేశారు. స్వల్ప ఛేదనను సౌతాఫ్రికా అమ్మాయిలు 17.1 ఓవర్లలోనే దంచేశారు. కెప్టెన్ లారా వోల్వార్ట్ (54), సునె లుస్ (57) అర్ధ శతకాలతో తొలి వికెట్‌కు 106 రన్స్ జోడించారు. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఈనెల 22న జోహన్నెస్‌బెర్గ్‌లో జరుగుతుంది.