Sourav Ganguly : భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) ఆన్లైన్ వేధింపుల బారిన పడ్డాడు. ఓ యూట్యూబర్ దాదాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పెట్టాడు. దాంతో, గంగూలీ సదరు యూట్యూబర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అయిన గంగూలీపై చెత్త వాగుతున్న ఆ యూట్యూబర్ పేరు మృణ్మోయ్ దాస్(Mrinmoy Das).
దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసుపై తాను చేసిన కామెంట్లను మృణయ్మోయ్ వక్రీకరించాడని పేర్కొన్న గంగూలీ అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ‘సౌరభ్ గంగూలీ లక్ష్యంగా ఈ యూట్యూబర్ సోషల్ మీడియా ఖాతాల్లో అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టాడు. దాదా గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా అసభ్యకరమైన భాషను ఉపయోగించాడు. అంతేకాదు గంగూలీపై దారుణమైన కామెంట్లు చేశాడు. అతడి వీడియోల్లోని కంటెంట్ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉంది’ అని ఫిర్యాదులో పోలీసులు వెల్లడించారు.
VIDEO | Former Indian cricketer Sourav Ganguly (@SGanguly99), along with wife Dona and daughter Sana, takes part in candlelight protest in Kolkata, demanding justice for RG Kar Medical College and Hospital rape-murder victim. pic.twitter.com/aSxDZvohhz
— Press Trust of India (@PTI_News) August 21, 2024
అసలేం జరిగిందంటే..? ఆర్జీకార్ వైద్య కళాశాలకు చెందిన 22 ఏండ్ల ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. ఈ కేసు గురించి గంగూలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘ఇలాంటి సంఘటనలు
ఎక్కడైనా జరుగుతాయి. దురదృష్టవశాత్తూ దవాఖానలో ఈ సంఘటన జరిగింది. కాబట్టి ప్రతిచోట ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం’ అని దాదా అన్నాడు.
అంతే.. సోషల్ మీడియాలో గంగూలీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ దెబ్బతో భారత సారథి నాలుక కరుచుకున్నాడు. తన వ్యాఖ్యల్ని మీడియా, పత్రికలు తప్పుగా అర్థం చేసుకున్నాయంటూ వివరణ ఇచ్చాడు. అయితే.. వైద్యురాలి హత్యపై గంగూలీ పోస్ట్‌ను ఆయుధంగా చేసుకున్న యూట్యూబర్ మృణయ్మోయ్ ఇక రెచ్చిపోయాడు. గంగూలీ బతికి ఉండగానే అతడి జీవితచరిత్రను తెరకెక్కించడం అవసరమా?