Liam Livingstone : ఆస్ట్రేలియాపై చితక్కొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. స్వదేశంలో ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసిన లివింగ్‌స్టోన్ బంతితోనూ మ్యాజిక్ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుపొందిన అతడు టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో రాకెట్లా దూసుకొచ్చాడు. నంబర్ 1 స్థానంలో ఉన్న ‘హల్క్’ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis)ను రెండో స్థానంలోకి నెట్టేశాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. మొదటి టీ20లో మొదట 27 బంతుల్లో 37 రన్స్ కొట్టిన అతడు.. అనంతరం బంతితోనూ చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్లను బుట్టలో వేసుకొని 322 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. ఇక రెండో టీ20లోనూ ఈ ఆల్‌రౌండర్ కంగారూలను వణికించాడు. తొలుత 47 బంతుల్లోనే 87 పరుగులు రాబట్టిన అతడు ఆ తర్వాత రెండు కీలక వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకి ఎంపికయ్యాడు. నిర్ణయాత్మక మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరుజట్లు సిరీస్‌ను పంచుకున్నాయి.
Livi is going OFF! 🔥
Live clips: https://t.co/zd6mj52hLC
🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/u0URfoUIGP
— England Cricket (@englandcricket) September 13, 2024
టీ20ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు పెట్టింది పేరైన లివింగ్‌స్టోన్ 2017లో జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతడు 49 టీ20లు ఆడాడంతే. పొట్టి ఫార్మాట్లో విజయవంతం కావడంతో ఆ తర్వాత వన్డేల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో రాణిస్తున్న లివింగ్‌స్టోన్ ఫ్రాంచైజీ క్రికెట్లో అదరగొడుతున్నాడు.
సుడిగాలి ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల లివింగ్‌స్టోన్ ఐపీఎల్లో పాపులర్ అయ్యాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ఆడిన ఈ ఆల్‌రౌండర్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు మారాడు. 2022 వేలంలో పంజాబ్ అతడిని రూ.11.50 కోట్ల భారీ ధరకు కొన్నది. అయితే.. లివింగ్‌స్టోన్ ఒకటి రెండు మ్యాచుల్లో మినహా పెద్దక రాణించలేదు.