AFG vs SA : టీ20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్లకు షాకిచ్చిన అఫ్గనిస్థాన్(Afghanistan) మరో సంచలనం నమోదు చేసింది. అదే జోరును కొనసాగిస్తూ వన్డేల్లో తొలిసారి దక్షిణాఫ్రికా(South Africa)ను ఆలౌట్ చేసింది. షార్జా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ(4/35), స్పిన్నర్ అల్లాహ్ ఘజన్ఫర్(3/20), విజృంభణతో వరల్డ్ కప్ రన్నరప్ అయిన సఫారీ జట్టు 106 పరుగులకే కుప్పకూలింది. టాప్ ఆటగాళ్లంతా బ్యాట్లు ఎత్తేసిన చోట వియాన్ మల్డర్(52) అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేసి జట్టు పరువు కాపాడాడు. లేదంటే ప్రొటిస్ జట్టు వంద లోపే ఆలౌటయ్యేది.
తాత్కాలికంగా వన్డే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఎడెన్ మర్క్రమ్(Aiden Markram)కు పెద్ద షాక్. షార్జా క్రికెట్ స్టేడియంలో అఫ్గనిస్థాన్ బౌలర్లు రెచ్చిపోయారు. పవర్ ప్లేలోనే ఫారూఖీ తాను ఎంత ప్రమాదకరమో మరోసారి చాటాడు. డేంజరస్ రీజా హెండ్రిక్స్(9)తో పాటు టోనీ డి జొర్జి(11), ఎడెన్ మర్క్రమ్(2)లను చకాచకా పెవిలియన్ పంపాడు. యువ స్పిన్నర్ అల్లాహ్ ఘజన్ఫర్(3/20) సైతం వికెట్ల వేట కొనసాగించడంతో సఫారీ జట్టు పేకమేడను తలపించింది.
A horror start for South Africa 😮
🔗 https://t.co/2KVGP8ugAZ | #AFGvSA pic.twitter.com/8nEfPtOKlC
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2024
ఫారూఖీ, అల్లాహ్లు నిప్పులు చెరగగా 29-4 నుంచి 75 కే 8 వికెట్లు పడడంతో మర్క్రమ్ సేన కోలుకోలేకపోయింది. అయితే.. వియన్ మల్డర్(52) అసమాన పోరాటంతో స్కోర్‌బోర్డును కదిలించాడు. తొందరపడి వికెట్ పారేసుకోకుడా హాఫ్ సెంచరీతో దక్షిణాఫ్రికాకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. సఫారీ ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారిన మల్డర్‌ను ఫారూఖీ బౌల్డ్ చేసి అఫ్గన్ జట్టుకు మరోసారి పెద్ద బ్రేకిచ్చాడు. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్(2/30) సైతం ఓ చేయి వేయగా దక్షిణాఫ్రికా ఆలౌటయ్యింది.