IND vs BAN : పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్(Bangladesh) ఇప్పుడు అనామక జట్టు కాదు. ఒకప్పుడు అడపాదడపా వన్డేలు, టీ20ల్లో సంచలన విజయాలకే పరిమితమైన బంగ్లా ఈ మధ్య నిలకడగా రాణిస్తోంది. పెద్ద జట్లకు సైతం షాకిస్తూ తమను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరికలు పంపుతోంది. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో ఆసియా జట్టు పులిలా గాండ్రిస్తోంది. న్యూజిలాండ్ (Newzealand)ను వాళ్ల సొంతగడ్డపైనే మట్టికరిపించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. తాజాగా పాకిస్థాన్(Pakistan)ను వైట్‌వాష్ చేసేసింది. అందకనే నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto) నేతృత్వంలోని బంగ్లా ఇప్పుడు ఎంతో ప్రమాదకారి.
పాక్‌పై విజయోత్సాహంతో భారత పర్యటనకు వచ్చిన శాంటో సేన సంచలన విజయంపై కన్నేసింది. అందుకనే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను లైట్ తీసుకోమని, బహు పరాకుగా ఉంటామని భారత సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఇప్పటికే చెప్పేశాడు. ఎందుకంటే రెండేండ్ల క్రితం టీమిండియాను ఓటమి అంచున నిలిపిన బంగ్లాదేశ్‌ను అతడు మర్చిపోలేదు.
గత రికార్డులు పరిశీలిస్తే.. టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియాదే పైచేయి. ఇప్పటివరకూ 13 మ్యాచుల్లో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. 11 విజయాలతో భారత్ ఆధిపత్యం చెలాయించింది. రికార్డులు పరంగా ఈసారి కూడా రోహిత్ సేన గెలపుపై ఢోకా లేదు. కానీ, రెండేండ్ల క్రితం భారత జట్టుకు బంగ్లా ముచ్చెమటలు పట్టించింది. ఢాకా వేదికగా సొంత ప్రేక్షకుల సమక్షంలో టీమిండియాను దాదాపు ఓడించినంత పని చేసింది.
నాలుగో ఇన్నింగ్స్‌లో యువ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. 145 పరుగుల ఛేదనకు దిగిన భారత జట్టును మిరాజ్(5/63) బెంబేలెత్తించాడు. తన సంచలన బౌలింగ్‌తో టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. దాంతో బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి చేరువైంది. ఆ పరిస్థితుల్లో అశ్విన్(42 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(29 నాటౌట్)లు అసమాన పోరాటం కనబరిచారు. ఈ ఇద్దరూ మొండిగా పోరాడి 62 బంతుల్లో 42 పరుగులు జోడించడంతో భారత జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది.
మిరాజ్ వికెట్ సంబురం
అయితే.. స్వదేశంలో టీమిండియాను ఓడించడడం బంగ్లాకు శక్తికి మించిన పనే. అలాగని రోహిత్ సేన ప్రత్యర్థిని లైట్ తీసుకోవడం లేదు. ఎందుకో తెలుసా.. బంగ్లాదేశ్‌కు అనుభవజ్ఞుడైన షకీబుల్ హసన్(Shakib Al Hasan) ఉన్నాడు. భారత పిచ్‌లపై ఘనమైన రికార్డు అతడి సొంతం. యువ పేసర్ షొరిఫుల్ ఇస్లాం, యంగ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాంలు పాకిస్థాన్‌పై అద్భుతంగా రాణించారు. తొలి టెస్టులో ఈ ముగ్గురి నుంచి భారత ఆటగాళ్లకు సవాల్ ఎదురయ్యే అవకాశముంది. ఇక బ్యాటింగ్‌లో సీనియర్లు ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్లపైనే బంగ్లా ఎక్కువగా ఆధాపడుతోంది.
షకీబుల్ హసన్, ముష్ఫికర్, లిటన్ దాస్
Sound 🔛
We bring you raw sounds 🔊 from #TeamIndia nets as they gear up for Test Cricket action 😎#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/8SvdTg29J7
— BCCI (@BCCI) September 17, 2024