Old Man Stabbed | యువతికి ప్రపోజ్ చేసిన వృద్ధుడు.. ప్రియుడితో కలిసి కత్తితో పొడిచింది
Old Man Stabbed | పరిచయం ఉన్న యువతిని వృద్ధుడు పార్కుకు పిలిచాడు. అక్కడ ఆమెకు ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ మరోసారి పార్కులో కలుసుకున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన యువతి ప్రియుడు ఆ వ్యక్తిని కత్తితో పొడిచాడు.
బెంగళూరు: పరిచయం ఉన్న యువతిని వృద్ధుడు పార్కుకు పిలిచాడు. అక్కడ ఆమెకు ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ మరోసారి పార్కులో కలుసుకున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన యువతి ప్రియుడు ఆ వ్యక్తిని కత్తితో పొడిచాడు. (Old Man Stabbed) ఈ విషయం తెలిసిన పోలీసులు గాయపడిన వృద్ధుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో పొడిచిన యువతి, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 60 ఏళ్ల హితేంద్ర కుమార్‌కు జయనగర్‌లో క్లాత్ షాప్ ఉంది. ఒక యువతి కొన్ని నెలలపాటు అతడి షాప్‌లో పని చేసి మానేసింది.
కాగా, బీటీఎం లేఅవుట్లోని కేఈబీ పార్క్‌లో హితేంద్ర కుమార్, ఆ యువతి కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రేమను ఆమెకు ప్రజోజ్ చేశాడు. సెప్టెంబర్ 15న కూడా వారిద్దరూ ఆ పార్కుకు వెళ్లారు. ఒక బెంచ్‌పై కూర్చొన్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో యువతి స్నేహితుడు సిద్ధు ఆ పార్క్‌కు వచ్చాడు. హితేంద్ర కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. కడుపులో ఇతర భాగాలపై కత్తితో పొడిచాడు. దీంతో హితేంద్ర కుప్పకూలిపోయాడు.
మరోవైపు ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన హితేంద్రను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఫిర్యాదుతో యువతి, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. అయితే క్లాత్ షాపులో పని చేసినప్పుడు హితేంద్ర తనను వేధించినట్లు ఆ యువతి ఆరోపించింది. పార్క్‌లో తనకు ప్రపోజ్ చేయడం గురించి తన ఫ్రెండ్‌కు చెప్పినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో యువతి ప్రియుడు ఆ వృద్ధుడిపై దాడి చేశాడా? లేక వారిద్దరూ కలిసి నేరానికి కుట్ర పన్నారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హితేంద్ర, ఆ యువతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు. అలాగే బట్టల షాపులోని మిగతా సిబ్బంది స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

