Jr NTR Movie | ఆంధ్రప్రదేశ్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. రోగికి ఏకంగా సినిమా చూపిస్తూ విజయవంతంగా మెదడులోని ట్యూమర్‌ను తొలగించారు. వైద్య పరిభాషలో ఈ సర్జరీని అవేక్ క్రేనియటోమీగా పేర్కొంటారు. ఆపరేషన్ చేసే సమయంలో రోగులు తప్పనిసరిగా మేల్కొని ఉండాల్సి ఉంటుంది. దాంతో నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండడం ఆపరేషన్ మరింత సులువు అవుతుందని వైద్యలు పేర్కొంటున్నారు. అయితే, అనంతలక్ష్మి (55) అనే మహిళ కొద్దిరోజులుగా మెదడులో కణితితో బాధపడుతున్నది. అవయవాలు చచ్చుపడినట్లుగా మారడం, తలనొప్పితో బాధపడుతున్నది. దీంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకోగా.. మెదడులో ట్యూమర్‌ని గుర్తించారు. ఆపరేషన్‌కి భారీగా ఖర్చుతూ కూడుకుతున్నది కావడంతో ఆమె కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. దాంతో వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఆమె ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూపించారు. అదుర్స్ మూవీలోని పలు కామెడి సీన్స్‌ను ట్యాబ్‌లో చూపించారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి మెదడులో కణితిని తొలగించారు.