ACB | కొత్తగూడెం కలెక్టర్‌లో బుధవారం అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రిప్ ఇరిగేషన్‌కు అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా జిల్లా హార్టికల్చర్ అధికారిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హార్టికల్చర్ఆఫీసర్ సూర్య నారాయణ డ్రిప్ ఇరిగేషన్ పర్మిషన్ కోసం రూ.1.14లక్షలు తీసుకుంటుండగా అధికారులు వలేసి పట్టుకున్నారు. హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు చేస్తున్నట్లు ఏబీసీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.
డ్రిప్‌కు సంబంధించిన ఫైల్స్‌ను ప్రాసెస్ చేసేందుకు, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్‌తో పొలాలను పరిశీలించేందుకు, బిల్లులు కలెక్టర్‌కు పంపేందుకు పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో రైతులకు సంబంధించిన 15 మంది నుంచి దాదాపు 14.17లక్షల పనులకు గాను లంచం డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులును హార్టికల్చర్ అధికారిని వలవేసి పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే తమను ఆశ్రయించాలని ఏసీబీ అధికారులు కోరారు. జిల్లా అధికారిని వరంగల్ సెషన్స్ కోర్టు జడ్జి ముందు హాజరుపరుచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.