Smriti Mandhana | భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) పెండ్లి రద్దెన (wedding cancellation) విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్మృతి, పలాశ్ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పెళ్లి రద్దు ప్రకటన తర్వాత స్మృతి తొలిసారి మీడియాకు కనిపించారు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ను షురూ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ మంధాన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు చేశారు.
కాగా, ఈ ఏడాది భారత మహిళల ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి.. డిసెంబర్ 21 నుంచి 30 వరకు స్వదేశంలో శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే నెట్స్‌లో ప్రాక్టీస్ షురూ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను స్మృతి సోదరుడు ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోకు లవ్ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్.. ‘స్మృతి ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గత నెల 23న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. వివాహ వేడుకలో భాగంగా హల్దీ, మెహందీ కార్యక్రమాలు సందడిగా సాగాయి. అయితే, పెళ్లికి సరిగ్గా ఒక్కరోజు ముందు మంధాన తండ్రి అనారోగ్యానికి గురై దవాఖాన పాలవడంతో ఆ కార్యక్రమం వాయిదాపడింది. ఆ తర్వాత పలాశ్ కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ కారణాలతో పెళ్లిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అప్పట్లో ప్రకటించారు. ఇక పెళ్లి రద్దైన రెండు వారాల తర్వాత ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వేర్వేరుగా పోస్టులు పెట్టి తమ పెండ్లి రైద్దెందని ప్రకటించారు.
‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. దీనిపై నేను మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది .నా గురించి అన్ని గోప్యంగా ఉండాలనే భావించే వ్యక్తిని. నా వివాహం రైద్దెందని స్పష్టం చేయదలుచుకున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. మా ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించి ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని స్మృతి ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చింది. వివాహం రైద్దెనా ఇకపై తన దృష్టంతా క్రికెట్ మీదే నిలుపుతానని, దేశానికి అత్యున్నత స్థాయిలో మరిన్ని ట్రోఫీలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొంది. పలాశ్ సైతం ఇన్‌స్టాలో ఈ విషయాన్ని ప్రకటించాడు.
Also Read..
మా పెండ్లి రైద్దెంది.. సోషల్ మీడియాలో ప్రకటించిన స్మృతి, పలాశ్
ఉల్లాసంగా జేపీఎల్ ఆరంభం.. ఎంఎల్ఆర్ఐటీలో ప్రారంభించిన హరీష్‌రావు
అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ, సుందర్