Smriti Mandhana : భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల వెల్లువ కొనసాగుతోంది. భీకర ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వరల్డ్ కప్‌లో అర్ధ శతకంతో మరో మైలురాయిని అధిగమించింది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుందీ విధ్వంసక ఓపెనర్. దాంతో, మహిళా క్రికెట్ చరిత్రలో ఒక క్యాలండర్ ఇయర్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కొత్త అధ్యాయాన్ని లిభించింది.
ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులతో ఆస్ట్రేలియా దిగ్గజం బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్ధలు కొట్టిందీ బ్యాటింగ్ క్వీన్. ఆసీస్ వెటరన్ అయిన క్లార్క్ 1997లో 970 రన్స్‌తో చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి .. దాదాపు 27 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డును మంధాన బ్రేక్ చేసింది. మొత్తంగా 18 ఇన్నింగ్స్‌ల్లో మంధాన 59.00 సగటుతో 1,062 పరుగులు సాధించింది.
Smriti Mandhana, the first to 1000 runs in a year in women’s ODIs 🫡 pic.twitter.com/bO7gU0X98v
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న మంధాన పరుగుల వరద పారిస్తోంది. వరల్డ్ కప్ ముందే ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలతో కదం తొక్కిన ఈ డాషింగ్ బ్యాటర్ మెగా టోర్నీ తొలి రెండు మ్యాచుల్లో నిరాశపరిచింది. కానీ, వైజాగ్‌లో ప్రతీకా రావల్‌తో కలిసి ఆసీస్ బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు శుభారంభం ఇచ్చిన మంధాన సెంచరీ ముందు ఔటయ్యింది. లేదంటే.. ఈ ఏడాది నాలుగు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న ఆమె తంజిబ్ బ్రిట్స్ ( Tanzim Brits) రికార్డును సమం చేసేది. హాఫ్ సెంచరీ తర్వాత వెనుదిరిగిన మంధాన వన్డేల్లో 5వేల పరుగుల క్లబ్లో చేరింది.
Smriti Mandhana in full flow 🚀
She becomes the first women’s cricketer to cross 1️⃣0️⃣0️⃣0️⃣ ODI runs in a calendar year 👏
Watch #INDvAUS LIVE in your region, #CWC25 broadcast details here ➡️ https://t.co/7wsR28PFHI pic.twitter.com/ix0BCVi6p1
— ICC (@ICC) October 12, 2025