IND vs WI : ఢిల్లీ టెస్టులో ఓటమి తప్పించుకునేందుకు వెస్టిండీస్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (5-82) విజృంభణకు చేతులెత్తేసిన విండీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ (10) మరోసారి నిరాశపరచగా.. జాన్ క్యాంప్‌బెల్ (87 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. అతడికి షాయ్ హోప్ (66 నాటౌట్)తోడవ్వగా ఆట ముగిసే సిరికి విండీస్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అయినా ఇంకా 97 పరుగులు వెనుకంజలోనే ఉంది పర్యాటక జట్టు.
That’s stumps on Day 3️⃣!
A wicket each for Mohd. Siraj and Washington Sundar 👍
West Indies trail #TeamIndia by 9️⃣7️⃣ runs (f/o)
Scorecard ▶️ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/UVnrWKJ3Zb
— BCCI (@BCCI) October 12, 2025
తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందిన భారత జట్టు సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. అనంతరం కుల్దీప్ యాదవ్ తిప్పేయగా విండీస్ 248కు కుప్పకూలి ఫాలో ఆన్ ఆడింది. ఓవర్‌నైట్ స్కోర్ 140/4తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన కరీబియన్ జట్టును కుల్దీప్ దెబ్బకొట్టాడు. క్రీజులో పాతుకుపోయిన టెవిన్ ఇమ్లాచ్(21) ఎల్బీగా వెనక్కి పంపిన ఈ చైనామన్ బౌలర్.. గ్రేవ్స్‌ను పెవిలియన్ చేర్చాడు. ఖారీ పీయెర్రీ(23)ని బుమ్రా బౌల్డ్ చేయగా.. అండర్సన్ ఫిలిప్(24 నాటౌట్), జైడన్ సీల్స్ (13) కాసేపు ప్రతిఘటించారు. అయితే.. సీల్స్‌ను ఎల్బీగా ఔట్ చేసి ఐదో వికెట్ సాధించిన కుల్దీప్ స్టిండీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దాంతో.. రోస్టన్ ఛేజ్ బృందం ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!
5⃣ wickets for Kuldeep Yadav
3⃣ wickets for Ravindra Jadeja
1⃣ wicket each for Mohd. Siraj and Jasprit Bumrah #TeamIndia lead by 270 runs and have enforced the follow-on 👍Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/qEIjD4t2OT
— BCCI (@BCCI) October 12, 2025
రెండో ఇన్నింగ్స్‌లో పోరాడి భారత్‌కు సవాల్ విసరాలనుకున్న విండీస్ ఆశలపై సిరాజ్ నీళ్లు చల్లాడు. ఆరంభంలోనే ఓపెనర్ చందర్‌పాల్(10)ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. గిల్ డైవింగ్ క్యాంచ్ అందుకోవడంతో తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న అలిక్ అథనజే (7)ను సుందర్ బౌల్డ్ చేయడంతో35కే రెండు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును ఓపెనర్ క్యాంప్‌బెల్ (87 నాటౌట్), షాయ్ హోప్(66 నాటౌట్)లు ఆదుకున్నారు.
𝗜.𝗖.𝗬.𝗠.𝗜
A catch worthy of being played on loop ➰#TeamIndia Captain Shubman Gill with a splendid effort 👏
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/DH3dvSDnHS
— BCCI (@BCCI) October 12, 2025
మూడో సెషన్లో వికెట్ కాపాడుకున్న ఈఇద్దరూ భారత బౌలర్లను విసిగిస్తూ స్కోర్‌బోర్డును నడిపించారు. ఈ సిరీస్‌లో తొలి అర్ధ శతకాలతో మెరిసిన వీరిద్దిరూ మూడో వికెట్‌కు అజేయంగా 138 రన్స్ జోడించారు. దాంతో, ఆట ముగిసే సరికి 173 పరుగులు చేసింది. ఇంకా 97 పరుగులు వెనుకంజలో ఉన్న విండీస్ నాలుగో రోజు ఎంతసేపు పోరాడుతుందో చూడాలి.