INDW vs AUSW : భారత్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) ఔటయ్యింది. మేగన్ షట్ ఓవర్లో కట్ షాట్ ఆడబోయిన ఆమె మొలినెక్స్ చేతికి క్యాచ్ ఇచ్చింది. ఆ కాసేపటికే పెద్ద షాట్‌కు యత్నించిన హర్లీన్ డియోల్ (38) సథర్లాండ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది. 6 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడడంతో.. జెమీమా రోడ్రిగ్స్ .. టెయిలెండర్లపై జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత పడింది. 38 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 240/4.
విశాఖపట్టణంలో భారత ఓపెనర్లు ప్రతీకా రావల్(64 నాటౌట్), స్మృతి మంధాన(80)లు అర్ధ శతకాలతో చెలరేగారు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపెడుతూ బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు మంచి పునాది వేశారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన మంధాన పేసర్ తహ్లియా మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో సిక్సర్ బాదింది. ఆ తర్వాత మొలినెక్స్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి టైమింగ్ కుదరక బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్ చేతికి చిక్కింది. దాంతో, 155 పరుగుల వద్ద టీమిండియ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత అనాబెల్ సథర్లాండ్ ఓవర్లో ప్రతీకా సైతం వెనుదిరింది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్ దూకుడుగా ఆడారు.
Pratika Rawal’s second ODI fifty against Australia is a classy one and she gets a standing ovation 👏 pic.twitter.com/OXWJYr35hx
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025