Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది తెలంగాన వలస కార్మికులకు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు భరోసా కల్పించారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని.. వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు.
మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లామని జోర్దాన్‌లో చిక్కుకుపోయిన వారికి హరీశ్‌రావు వివరించారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చే కృషి చేస్తున్నాం.. అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏడాది క్రితం ఉపాధి కోసం 12 మంది వలస కార్మికులు జోర్డాన్‌కు వెళ్లారు. వీరిలో నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఈ క్రమంలో వారి ఇబ్బందులను చెబుతూ ఇటీవల ఒక వీడియోను పంపించారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హరీశ్‌రావుకు వలస కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో వారికి హరీశ్‌రావు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.
ఆందోళన పడకండి.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
– జోర్డాన్ లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు మాజీ మంత్రి @BRSHarish భరోసా
మీ సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకువెళ్ళాం..
మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం
ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి… pic.twitter.com/yu0sBtHD9S
— Office of Harish Rao (@HarishRaoOffice) October 12, 2025
1. మెట్టు ముత్యం, కూచన్‌పల్లి, సోను మండలం, నిర్మల్
2. వంగ భాస్కర్, దోమకొండ, జిల్లా, కామారెడ్డి
3. వల్గేట్, గంగాధర్, ఎరుగట్ల, నిజామాబాద్
4. మాచర్ల స్వామి, చింతమనపల్లి, కామారెడ్డి
5. గుమ్ముల మనోహర్, వెల్కటూరు, జగిత్యాల
6. పెండ్యాల మహేందర్, దుబ్బాక, జిల్లా సిద్దిపేట
7. గణేష్, కామారెడ్డి
8. పెండ్యాల. శ్రీను, నిజామాబాద్
9. బొమ్మనమన.పోచయ్య, సిద్దిపేట
10. రాజుకుమార్. కామారెడ్డి
11. ముకిం కుంటల డి. నిర్మల్
12. నర్సింలు, జగిత్యాల
ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను @TelanganaCMO పట్టించుకోకపోవడం దుర్మార్గం.
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటు.
నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్,… pic.twitter.com/MMSYjfXNnV
— Harish Rao Thanneeru (@BRSHarish) October 10, 2025