INDW vs AUSW : విశాఖపట్టణంలో భారత ఓపెనర్లు ప్రతీకా రావల్(64 నాటౌట్), స్మృతి మంధాన(80)లు అర్ధ శతకాలతో చెలరేగారు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపెడుతూ బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు మంచి పునాది వేశారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన మంధాన పేసర్ తహ్లియా మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో సిక్సర్ బాదింది. ఆ తర్వాత మొలినెక్స్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి టైమింగ్ కుదరక బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్ చేతికి చిక్కింది. దాంతో, 155 పరుగుల వద్ద టీమిండియ తొలి వికెట్ పడింది. ప్రస్తుతం ఓపెనర్ ప్రతీకా జతగా హర్లీన్ డియోల్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లకు స్కోర్. 156-1.
టాస్ ఓడిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. ఈ మెగా టోర్నీలో విఫలమైన స్మృతి మంధాన(80) ఈసారి బాధ్యతగా ఆడింది. ఆస్ట్రేలియాపై తన రికార్డును కొనసాగిస్తూ బౌండరీలతో అలరించింది. మరో ఓపెనర్ ప్రతీకా రావల్ (64 నాటౌట్) తనదైన స్టయిల్లో చెలరేగిపోగా.. ఇద్దరూ స్కోర్ బోర్డును ఉరికించారు.
A solid knock so far👌
3⃣3⃣rd ODI FIFTY for Smriti Mandhana 🔥
Her first in #CWC25 ✅
Updates ▶ https://t.co/VP5FlL3pWw#TeamIndia | #WomenInBlue | #INDvAUS | @mandhana_smriti pic.twitter.com/KuBUlOGOik
— BCCI Women (@BCCIWomen) October 12, 2025
ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఈ ద్వయం పవర్ ప్లేలోనే 58 రన్స్ బాదింది. అనంతరం అదే దూకుడు కనబరిచిన మంధాన కెరీర్లో 33వ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కాసేపటికే ప్రతీకా సైతం అర్ధ శతకం సాధించింది.