Siraj : భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj ) మైదానంలో ఫుల్‌జోష్‌లో ఉంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కవ్విస్తూ.. వాళ్లకు సవాల్ విసురుతూ ఆధిపత్యం చెలయించాలని చూస్తాడు. వికెట్గానీ పడిందంటే చాలు అతడు తనదైన స్టయిల్లో సెలబ్రేట్ చేసుకుంటాడు. మనందరికీ ఆవేశం స్టార్‌గానే తెలిసిన ‘మియా భాయ్’ లార్డ్స్ టెస్టులో మాత్రం మౌనమునిలా కనిపించాడు. తన మార్క్ ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను ఆదుకున్న డేంజరస్ జేమీ స్మిత్(Jamie Smith)ను ఔట్ చేశాక ఈ స్పీడ్‌స్టర్ కాసింత దిగులుగా కనిపించాడు. కుడి చేతి చూపుడు వేలు, మధ్య వేలిని మాత్రమే చూపిస్తూ.. ఎడమ చేతిని పిడిగిలి బిగించి ఆకాశంకేసి చూశాడు. అప్పడు అతడలా ఎందుకు చేశాడో ఎవరికీ అర్ధం కాలేదు. ఇదే విషయంపై రెండో రోజు స్టంప్స్ అనంతరం సిరాజ్ మాట్లాడాడు.
Mohammed Siraj pays tribute to Diogo Jota ❤️
@LFC | @StarSportsIndia pic.twitter.com/1XemOahFKj
— Premier League India (@PLforIndia) July 11, 2025
‘మేము బర్మింగ్హమ్లో ఆడుతున్నప్పుడే కారు ప్రమాదంలో లివర్‌పూల్ ఫుట్‌బాలర్ డియోగో జొటా (Diago Jota) దుర్మరణం చెందాడనే వార్త తెలిసింది అతడు పోర్చ్‌గల్ ప్లేయర్ కూడా. నేను పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)కు బిగ్ ఫ్యాన్. సో ఆ జట్టు ఆటగాడు చనిపోవడంతో ఎంతో కలత చెందాను. మనసంతా బాధతో నిండిపోయింది. అందుకే.. దివంగత జాటోకు మైదానంలో నివాళి అర్పించాలనుకుంటున్నానని కుల్దీప్ యాదవ్‌తో చెప్పాను.
రెండో రోజు స్మిత్ వికెట్ తీయగానే జాటోకు నివాళిగా.. చేతుల్ని అతడి జెర్సీ నంబర్ 20కి గుర్తుగా చూపించాను. అనంతరం ఆకాశంకేసి చూస్తూ అతడిని స్మరించుకున్నాను. జాటో అకాలమరణం తర్వాత జీవితమనేది మన ఊహకు అందదనే విషయాన్ని గ్రహించాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో పసిగట్టలేం. మనం ఎవరికోసమో పోరాడుతాం.. ఎవరికోసం బతుకుతాం. కానీ, రేపటి రోజున ఏం జరుగునో అంచనా వేయలేం’ అని సిరాజ్ వెల్లడించాడు.
A heartfelt gesture!
Mohammed Siraj pays his tribute to the late Diogo Jota. pic.twitter.com/B59kmWG3TO
— BCCI (@BCCI) July 12, 2025
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో భారత బౌలర్లను విసిగించిన స్మిత్(51)ను సిరాజ్ వెనక్కి పంపాడు. టీ బ్రేక్ తర్వాత అతడి ఆట కట్టించి.. మ్యాచ్‌ను మలుపుతిప్పాడీ పేస్ గన్. అనంతరం ఆర్చర్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా.. బ్రాండన్ కార్సే(56)ను బౌల్డ్ చేసిన సిరాజ్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.