పాలమూరు : పెరిగిపోతున్న సైబర్ నేరాలపై (Cyber Crimes) ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ రామమూర్తి( SBI RM Ramamurthy) సూచించారు. శనివారం స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో బ్రాంచి మేనేజర్లతో కలిసి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రతి రోజు కొత్త కొత్త పద్దతులతో ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఒక వేళ పొరపాటున మోసపోతే, వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సైబర్ నేరం వివరాలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది నళిని , బాల సుబ్రమణ్యం, జగన్ , భూషణ్ , ప్రవీణ్ , పట్టణ బ్రాంచి మేనేజర్లు కల్వ భాస్కర్ , అల్తాఫ్ , మోహన్ , ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సభ్యులు ప్రభావతి, నరేష్, భాస్కర్ పాల్గొన్నారు.