Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ఎదురీదుతోంది. రెండో రోజు ఓలీ పోప్(106) సెంచరీతో కోలుకున్న ఆ జట్టు మూడో రోజుతొలి సెషన్లో కీలక వికెట్లు కోల్పోయింది. ఆట ఆరంభమైన కాసేపటికే డేంజరస్ పోప్‌ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(20), హ్యారీ బ్రూక్(42)లు ఓపికగా ఆడుతూ భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. అయితే.. తడబడుతున్న స్టోక్స్‌ను సిరాజ్ వెనక్కి పంపాడు. వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 276 వద్ద సగం వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును ఆదుకునే భారం బ్రూక్ వికెట్ కీపర్ జేమీ స్మి(5)త్ల మీదనే ఉంది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 189 పరుగులు వెనకబడి ఉంది.
And this time it’s Mohd. Siraj with the breakthrough 🔥
Ben Stokes departs as vice-captain @RishabhPant17 takes his second catch 🙌
England 5⃣ down
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @mdsirajofficial pic.twitter.com/Zru2p3l2Kv
— BCCI (@BCCI) June 22, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టు రసపట్టులో సాగుతోంది. తొలి రోజే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(147), యశస్వీ జైస్వాల్(101) సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్‌కు బాటు వేయగా.. రెండో రోజు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(138) శతకంతో మెరిశాడు. దాంతో, భారత్ 500 ప్లస్ కొడుతుందని, ఇక ఇంగ్లండ్‌కు కష్టమేనని అభిమానులు అనుకున్నారు. కానీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471కే ఆలౌటయ్యింది. రెండో రోజు గిల్ పంత్ ఔటయ్యాక వచ్చిన భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. కరుణ్ నాయర్ డకౌట్ కాగా.. జడేజా(11), శార్థూల్(1) నిరాశపరిచారు. పేసర్ జోష్ టంగ్(4-86) విజృంభణతో టకటకా టెయిలెండర్ల వికెట్లు కోల్పోయింది టీమిండియా.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు బుమ్రా షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే(4)ను ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బ కొట్టాడు. అయితే.. బెన్ డకెట్(62), ఓలీ పోప్(106)లు కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అర్ధ శతకం బాదిన డకెట్‌ను బుమ్రా బౌల్డ్ చేసి రెండో వికెట్ అందించాడు. ఆ కాసేపటికే జో రూట్(28)ను సైతం వెనక్కి పంపిన యార్కర్ కింగ్ టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. కానీ, పోప్ సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.